పాలవాయి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య సోమవారం తెల్లవారుజామున ఘర్షణ పడ్డారు. స్థానికుల వివరాల మేరకు వివరాలిలా వున్నాయి. టిడిపి, వైసిపి ఇరువర్గాలు పరస్పర దాడుల్లో టీడీపీ సానుభూతిపరులకు గాయాలు అయ్యాయి. వడ్డే భాగ్యమ్మ, గోపాల్, హనుమక్క గాయపడి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.