అనంతపురం జిల్లాలో రథానికి నిప్పంటించిన దుండగులు
కనేకల్ మండలం హనకనహాల్ లో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పంటించారు. స్థానికులు మంటలను ఆర్పారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ప్రమాదంలో రథం సగానికి పైగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, భజరంగ్ దళ్ కార్యక్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.