TG: మేడ్చల్ జిల్లా కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు 11 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల నుంచి కీసరగుట్టకు 270 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడవనున్నట్లు RTC అధికారులు తెలిపారు.