గోరంట్ల మండలంలో 20 గ్రామపంచాయతీలకు నాలుగో విడతలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 220 వార్డులు ఉండగా 230 పోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో అంజినప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు మండల విద్యాధికారి కలీముల్లా, హౌసింగ్ ఏఈ కుల చంద్ర రెడ్డి లను జోనల్ ఆఫీసర్ల గా నియమించామని మండల వ్యాప్తంగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్లు స్థానాలకు నామినేషన్లు వేయడానికి 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో రెండు నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయగా ఒకటవ కౌంటర్లో మల సముద్రం, వానవోలు, వానవోలు తండా, గౌనీ వారి పల్లి, కొండాపురం గ్రామ పంచాయతీలు, రెండవ కౌంటర్ లో బుదిలి, రెడ్డి చెరువు పల్లి, వడిగే పల్లి, పాలసముద్రం, నర్సింపల్లి గ్రామ పంచాయతీలు, వెలుగు కార్యాలయంలోని ఒకటో కౌంటర్ లో మందలపల్లి, పుట్ట గుండ్లపల్లి, గడ్డం తండా, కరవుల పల్లి తాండ, మల్లపల్లి గ్రామ పంచాయతీలు, రెండవ కౌంటర్ లో వెంకట రమణ పల్లి, కమ్మవారి పల్లి, గంగంపల్లి పంచాయతీలు, ఉపాధి హామీ కార్యాలయంలో గోరంట్ల, పూలేరు గ్రామపంచాయతీలలోని అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయాలన్నారు. నాల్గో విడతలో భాగంగా జరుగనున్న ఎన్నికలలో 10వ తేదీ, 11వ, 12వ తేదీలలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 13న స్కూట్నీ, 14న ఉపసంహరణ, 15న ఆప్పిల్ తో పాటు అభ్యర్థుల జాబితా విడుదల చేయడం, 21వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.