గోరంట్ల:వైసిపి సర్పంచ్ వినోద్ టీడీపీ లోకి చేరిక
గోరంట్ల మండలం రెడ్డిచెరువు పల్లి సర్పంచ్ వినోద్ కుమార్ గురువారం టీడీపీ లోకి చేరారు. పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సవిత సమక్షంలో రెడ్డి చెరువుపల్లి సర్పంచ్ వినోద్ కుమార్ తో పాటు మరో 29 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడీ టీడీపీ లోకి చేరారు. అదేవిధంగా మందలపల్లి పంచాయతీ కరావులపల్లి గ్రామం నుండి పలువురు నాయకులు టిడిపిలో చేరారు. వారందరికీ మంత్రి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.