గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు నిబంధనల మేరకు నడుచుకోవాలని, ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఐ జయ నాయక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గోరంట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నడుచుకుంటామని, ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఎలాంటి ఘర్షణలకు, అల్లర్లకు తావివ్వకుండా ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు. అలాగే రౌడీషీటర్లు, కేసులలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి ఘర్షణకు దిగినా చర్యలు తప్పవన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా జరిగేలా ఉండాలన్నారు.