రాప్తాడు మండలం, హంపాపురం సమీపంలోని శ్రీ మౌనగిరి హనుమన్ ఆలయాన్ని పరిటాల కుటుంబ సభ్యులు ఆదివారం సందర్శించారు. ఆలయ 7వ వార్షిక మహోత్సవం సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్, పరిటాల జ్ఞాన దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వారిని ఘనంగా సన్మానించారు.