రామగిరి: అనారోగ్యంతో టిడిపి కార్యకర్త మృతి
రామగిరి మండలంలోని నసనకోట గ్రామ పంచాయితీ కొత్తగేరీ గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త గొల్ల రాములమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు.. మండల తెలుగు యువత నాయకుడు లింగ శ్రీధర్ న్నాయుడు గ్రామానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సునీత మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.