మైనర్ బాలికను తల్లితండ్రిలకు అప్పగించిన పోలీసులు

16868చూసినవారు
మైనర్ బాలికను తల్లితండ్రిలకు అప్పగించిన పోలీసులు
చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 16 సంవత్సరాల మైనర్ బాలికను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న ప్రశాంతి ఆ బాలికను ఆదివారం చెన్నేకొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుట్టపర్తి మండలం గాజుల వారి పల్లి గ్రామానికి చెందిన వెంకటప్ప కృష్ణమ్మ లకు 16 సంవత్సరాల మైనర్ బాలిక కలదు. కూలి చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే వారి కూతురుకు ఇష్టం లేని వివాహ ప్రయత్నం చేస్తుండటంతో అది నచ్చని ఆ మైనర్ బాలిక ఇంటి నుంచి బయటికి వచ్చి ఎన్ ఎస్ గేటు ప్రాంతంలో అనుమానాస్పదంగా, సంచరిస్తుండగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న ప్రశాంతి గమనించి ఆ బాలికతో వివరాలను ఆరా తీసింది అన్నారు.

మైనర్ బాలికను చెన్నేకొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలికను విచారించగా పదహారేళ్ల వయసులో మా తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారని పెళ్లి చేస్తే నేను ఎలా చదువుకోవాలని ఏమి చేయాలో తాను దిక్కుతోచని స్థితిలో ఇంటి నుండి బయటకు వచ్చానని పోలీసులుతో తెలిపారు. దీంతో పోలీసులు మైనర్ బాలిక తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్