నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

60చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలు, హాస్టల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్