పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన బాధ్యత

62చూసినవారు
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన బాధ్యత
రాయదుర్గం పట్టణంలోని చౌడమ్మ కాలనీలోని కమ్యూనిటీ భవనంలో గురువారం ప్రజలకు అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రమేష్ మాట్లాడుతూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటూ వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాత్రిపూట దోమల నివారణకు వేపాకు పొగను వేసుకోవాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్