

రాయదుర్గం: నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
బొమ్మనహాల్ మండలం చంద్రగిరి గ్రామంలో గురువారం ఇద్దరు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. చంద్రగిరి గ్రామానికి చెందిన వంశీ, గోవిందరాజులు ఎద్దులకు నీళ్లు తాపేందుకు నీటి కుంటలోకి తీసుకెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మునిగి మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.