రాయదుర్గం: పడకేసిన పారిశుధ్యం - విజృంభిస్తున్న విష జ్వరాలు

73చూసినవారు
రాయదుర్గం: పడకేసిన పారిశుధ్యం - విజృంభిస్తున్న విష జ్వరాలు
రాయదుర్గం మండలం కాశీపురంలో పారిశుద్ధ్యం పడకేయటంతో ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరంతో మంచం పెట్టారని గ్రామస్తులు విలేఖరులకు గురువారం తెలిపారు. దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ లక్షణాలతో మొన్ననే 2వ తరగతి విద్యార్థి గౌతమ్ మృతి చెందాడు. ఇంత జరుగుతున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవటంలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్