రాయదుర్గం: 22న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో జాబ్ మేళా

59చూసినవారు
రాయదుర్గం: 22న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో జాబ్ మేళా
ఈనెల 22వ తేది రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాసులు బుధవారం విలేఖరులతో తెలిపారు. ప్రముఖ కంపెనీలైన టాటా ఎలక్ట్రానిక్స్, కోజెంట్ ఈ సర్వీసెస్ వారు జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసినవారు సర్టిఫికెట్స్ తో ఉదయం 9 గంటలకు కళాశాలకు రావాలన్నారు.