Sep 10, 2024, 14:09 IST/
పాత ఐఫోన్ మోడల్స్ పై సుమారు రూ.10 వేలు ధర తగ్గించిన యాపిల్
Sep 10, 2024, 14:09 IST
దిగ్గజ ఎలక్ట్రానిక్ బ్రాండ్ యాపిల్.. కొత్త ఐఫోన్ 16 సిరీస్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కంపెనీ తన పాత ఐఫోన్ మోడళ్ల ధరలను తగ్గించింది. దీంతో ఐఫోన్ 15 128GB వేరియంట్ రూ. 69,900కే అందుబాటులోకి రానుంది. గతంలో ఈ ఫోన్ ధర రూ. 79,900గా ఉండేది. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్ 128GB వేరియంట్ ధర రూ.79,900కి తగ్గింది. అలాగే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ల ప్రారంభ ధరలు ఇప్పుడు వరుసగా రూ.59,900, రూ.69,900కు తగ్గాయి.