తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో లక్ష్మినారాయణ, సౌజన్య దంపతుల కుమారుడైన రేవంత్ కుమార్ (2) గురువారం తెల్లవారు జామున డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. డెంగ్యూ జ్వరం బారిన పడిన చిన్నారికి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు బాలుని తల్లిదండ్రులు తెలిపారు. అయితే జ్వరం తీవ్రమై పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.