కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని తాడిపత్రి పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించే ఆకాశదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. తెల్లవారుజామున 3గంటలకు గండా దీపోత్సవం, స్వామివారికి క్షీరాభిషేకం, సాయంత్రం 6గంటలకు ఆకాశదీపోత్సవం, 7గంటలకు బాణాసంచా వేడుకలు, 7:30గంటలకు జ్వాలాతోరణం, 8 గంటలకు నెల్లూరు బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.