కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

77చూసినవారు
ఏపీలో కొత్త పెన్షన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త పెన్షన్‌లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. అర్హులైన పెన్షనర్లకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్