యాడికి మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీచెన్నకేశవ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేశారు. శుక్రవారం రాత్రి ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఆలయం ఎదురుగా ధ్వజస్తంభంపై భక్తులు, ఆలయ అర్చకులు దీపాన్ని వెలిగించి పూజలు చేశారు. భక్తులు భారీగా తరలి వచ్చారు.