అర్హులైన పేదలందరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు సోమవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో అనేక మంది పేదలకు ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉండలేక అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంత వెంకట రెడ్డి, కాలని శాఖ కార్యదర్శి ధనరాజ్ నాయకులు ముత్యాలన్న, పద్మావతి, యెర్రెమ్మ తదితరులు పాల్గొన్నారు.