కూడేరులో తాగునీటి సమస్యను పరిష్కరించండి

50చూసినవారు
కూడేరులో తాగునీటి సమస్యను పరిష్కరించండి
కూడేరు మండలంలోని కడదరగుంట, కూడేరు గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని గ్రామ సర్పంచ్ లలితమ్మ గురువారం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కూడేరు గ్రామ పంచాయతీలో హై ట్యాంకులు ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నాయని, ట్యాంకులు అన్ని శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. కొత్త ట్యాంకులు నిర్మించాలని, శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు నుంచి నీరు ప్రజలకు సక్రమంగా అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్