మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అదే బాటలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే.. జగన్‌కు, వైఎస్ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా పేరున్న సామినేని ఉదయభాను సైతం వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు జరుపుతున్న సామినేని.. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.