ఎన్నికల వేళ బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేసే దిశగా ఇపుడు చకచకా అడుగులు వేస్తున్నారు. బీసీల రక్షణ కోసం బీసీ ప్రోటెక్షన్ చట్టాన్ని ఏపీలో తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచారం. దీని వల్ల బీసీలకు రక్షణ చట్టపరంగా ఉంటుంది. ఈ చట్టం కనుక వస్తే బీసీలు తమను ఎవరైనా ఏమైనా అంటే కనుక తమ మనోభావాలు దెబ్బతింటే ఈ చట్టం ప్రకారం ఎదుర్కోవడానికి పూర్తి హక్కులు ఉంటాయి.