గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్‌లో విడుదల కాగా జూలై 31వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది. పలుమార్లు గడువు పొడిగించినా.. తాజాగా ఈ గడువును మరోసారి నవంబర్ 1 వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.