ప్రజల జీవన ప్రమాణాలు, నిత్యావసర వస్తువుల ధరల అదుపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు భిన్నమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. ‘ధరల పెరుగుదల వాస్తవమే’నని పేర్కొంటూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఒక నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా RBI మరింత విస్తృతంగా అధ్యయనం చేసి, ఒక నివేదిక విడుదల చేసింది. RBIకి చెందిన ఎకానమిక్ అండ్ పాలసీ రీసెర్చి విభాగం టమాటో, ఉల్లి, ఆలు ధరలపైనే కేంద్రీకరించి ఈ అధ్యయనం చేయడం విశేషం.