ఆంగ్ల భాషలో ఉల్లి, టమాటా, ఆలూ మొదటి అక్షరాలను కలిపి (టిఓపి-టాప్)గా ఆర్‌బిఐ పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు వీటి ధరల్లో సగటున 30 శాతం పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ‘క్రిసిల్ ఎంఐ అండ్ ఎ’ సెప్టెంబర్ నెలాఖరు వరకు చేసిన మరో అధ్యయనంలో ఏడాది కాలంలో టమాటా 18శాతం, ఉల్లి 50శాతం, ఆలూ 53 శాతం ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఈ రెండు నివేదికలు కూడా వీటి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చాయి.