సూర్యాపేట అదనపు కలెక్టర్ కారు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్రగాయాలు (వీడియో)

54చూసినవారు
జనగామ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాకేంద్రంలోని స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై గంగారపు సరోజున అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్