అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సోదరులు మృతి చెందారు. మృతులను తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, సదానంద రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.