ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను సోమవారం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించనుంది. ఇందుకోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఆరుగురు చొప్పున ఉద్యోగులు పని చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి అక్షరాస్యత, ఉద్యోగం, నిరుద్యోగం తదితర వివరాలను సేకరిస్తారు. ఈ సమాచారంతో ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేయనుంది.