ఎన్నో ఏళ్లుగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టనుంది. గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ పథకాన్ని త్వరలో అమల్లోకి తేనుంది. ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. నవంబర్ నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం కింద ఏపీలోని 18 జిల్లాల పరిధిలోని 878 గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో 25 రకాల అభివృద్ధి పనులు జరుగుతాయి.