రేపు AP EAPCET హాల్ టికెట్లు విడుదల

63చూసినవారు
రేపు AP EAPCET హాల్ టికెట్లు విడుదల
AP EAPCET హాల్ టికెట్లు మంగళవారం విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఈ నెల 16, 17వ తేదీల్లో జరగనుండగా.. ఇంజినీరింగ్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

ట్యాగ్స్ :