ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అమరావతి ప్రాంతంలో భూముల విలువలు ఇప్పటికే ఎక్కువగా ఉండటంతో అక్కడ కొంత రిజిస్ట్రేషన్ ధరల పెంపుకు మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.