కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక

187143చూసినవారు
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక
ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా కానుక అందించేందుకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వంలోని 177 శాఖల్లో 2014 జూన్ రెండో తేదీ నాటికి చేరిన 10,117 మంది రెగ్యులర్ అయ్యారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్