AP: రియల్ ఎస్టేట్ పెరగాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని.. దానికి అనుగుణంగానే నిబంధనలు సరళతరం చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించి కొత్తగా రూపొందించిన నిబంధనలను వచ్చే గురువారం జారీ చేస్తామని మంత్రి చెప్పారు. బిల్డర్లు ప్రభుత్వానికి సహకరించాలని నారాయణ కోరారు. నేడు విజయవాడలోని రెరా కార్యాలయంలో అధికారులతో ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.