వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ తనను 25 ప్రశ్నలు అడిగిందని తెలిపారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందని పేర్కొన్నారు.