TG: 'పుష్ప-2' ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ ఓనర్లకు కోర్టులో ఊరట లభించింది. ఓనర్లు చిన్నరామిరెడ్డి, పెద్దరామిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు షూరిటీలు, రూ.25 వేలు పూచీకత్తుగా సమర్పించాలని పేర్కొంది. ఇదే కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.