AP: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరును మెరుగు పరచడంతో పాటు అభివృద్ధి వేగవంతం చేసే లక్ష్యంతో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్(ర్యాంప్) సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారు. దీని కోసం ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్ పేరిట యాప్ను రూపొందించారు. రేపటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు ఈ సర్వే జరగనుంది.