AP టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

52చూసినవారు
AP టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఏపీలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన టెట్ పరీక్షల ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా, ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్‌లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేశారు. అక్టోబర్‌ 27న టెట్ పరీక్షల తుది కీ విడుదల చేయనున్నారు. వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ ను చూడగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్