ఏపీ పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించారు. 'పోలీసులు మొత్తబడి పోయారా? లేక భయపడిపోయారా? ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఇంకా వైసీపీ నాయకులే అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. వారి తోలు తీస్తా. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందో చూపించాలి. గత వైసీపీ ప్రభుత్వ ఇక్కడి యువతను బెదిరించింది' అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.