AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వేళ.. ఆ పార్టీ అధినేత జగన్ బిగ్ స్టెప్ వేశారు. జగన్ ఆదేశాల మేరకు అరెస్టుల అంశాన్ని వైసీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.