ఇటీవల జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాని మోదీ పలు దేశాల అధ్యక్షులకు భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన హస్తకళాకృతులను బహుమతులుగా అందజేశారు. మహారాష్ట్రలోని ప్రముఖ హస్తకళలలో ఒకటైన మదర్ ఆఫ్ పెర్ల్ (ఎంవోఊ) సీ-షెల్‌ను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కు, సంప్రదాయ వర్లీ పెయింటింగ్‌ను ఉబ్జెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయోవ్‌కి, ఝార్ఖండ్‌లోని సోహ్రాయ్ పెయింటింగ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బహుమతిగా అందించారు.