అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు సోమవారం పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణ పాల్గొని మాట్లాడారు. పొగాకు ధరలు ఎక్కువగా ఉన్నాయని అందరూ దాని సాగుపై దృష్టి పెడుతున్నారని దీనివలన ధరలు పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
ప్రత్యామ్నాయంగా శనగ, మినుము, మొక్కజొన్న పంటలను సాగు చేయాలని వెంకటకృష్ణ సూచించారు.