సోదరి ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ విసిరిన రాహుల్‌

68చూసినవారు
సోదరి ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ విసిరిన రాహుల్‌
వయనాడ్‌ ఉప ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యటక ప్రదేశంగా మార్చాలని ఛాలెంజ్‌ చేశారు. ‘‘రాజకీయాలకు అతీతంగా వయనాడ్‌కు నా హృదయంలో గొప్ప స్థానం ఉంది. ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యటక ప్రదేశంగా మార్చాడానికి ప్రియాంక కృషి చేయాలి. ఎవరైనా కేరళ వస్తే మొదట ఈ ప్రాంతమే గుర్తుకు రావాలి. కాబోయే ఎంపీ ఇది ఛాలెంజ్‌గా తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్