దర్శి లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

83చూసినవారు
దర్శి లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిలో గురువారం కాంగ్రెస్ అభ్యర్థి పోట్లూరు కొండారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్