కనిగిరి: దేవాంగనగర్ హైవే వద్ద ఆక్రమణల తొలగింపు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగనగర్ హైవే వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలను మంగళవారం సాయంత్రం అధికారులు చేపట్టారు. కాశిరెడ్డి కాలనీ నుండి పెద్ద చెరువు మీదగా హైవే రోడ్డు నిర్మాణం జరిపేందుకు ఈ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. చెరువు మీదుగా ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం నిర్మించేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో చర్యలు చేపట్టినట్లుగా అధికారులు పేర్కొన్నారు.