నాట్కో క్యాన్సర్ సెంటర్, చలపతి ఫార్మసీ కళాశాల సంయుక్తంగా జాతీయ ఫార్మసీ విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక నాజ్ సెంటర్, ఏసీ కళాశాల ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ మెడిసిన్ కి ప్రభావవంతమైన పర్యవేక్షణ అవసరమని, రోగులు సకాలంలో మందులు వాడితే మేలు జరుగుతుందని చెప్పారు.