అవినీతికి పాల్పడిన నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ రెవిన్యూ సర్వేయర్ కే. రామాంజనేయులుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘ నాయకులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో అర్జీ అందజేశారు. రామాంజనేయులు గత ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేలో పొలంలో రాళ్లు పాతిన డబ్బులతో అనేక అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. అతని వలన కలిగిన రెవెన్యూ లోపాలను సరిచేసి వారిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరారు.