మంగళగిరి చోరీ కేసుల్లో ముద్దాయి అరెస్ట్

63చూసినవారు
మంగళగిరి చోరీ కేసుల్లో ముద్దాయి అరెస్ట్
మంగళగిరి నగరంలోని చోరీలు, దారి దోపిడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న యువకుడిని మంగళగిరి పట్టణ సీఐ డి. వినోద్ కుమార్ మంగళవారం అరెస్ట్ చేశారు. ఈమేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో నిందితునిగా ఉన్న పఠాన్ షారుక్ ఖాన్ (23)ను సిబ్బందితో కలిసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్