మంగళగిరి: రాజధాని నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తి: మంత్రి
మంగళగిరి మండలం నీరుకొండ లో సోమవారం ఎంజీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించిన అనంతరం ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పాత కాంట్రాక్ట్‌లను రద్దు చేయకపోవడంతో ఆరు నెలలు వృథా అయినట్లు పేర్కొన్నారు. అలానే ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు అయినప్పటికీ రాజధాని నిర్మాణం 3ఏళ్లలోనే పూర్తి అవుతుందని ఆయన స్పష్టం చేశారు.