78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరు పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ నందు గురువారం జరిగిన కార్యక్రమంలో తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ప్రజా సేవలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకుగానూ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ సీఐ కళ్యాణ్ రాజుకి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐ కళ్యాణ్ రాజుకు పలువురు అభినందనలు తెలిపారు.